: రజకులకు వాషింగ్ మెషీన్లు, ఇస్త్రీపెట్టెలు, డ్రయ్యర్లు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం!


కులవృత్తులను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఇతర కులాల వారికి అవసరమైన పరికరాలను ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. రజకులకు వాషింగ్ మెషీన్లు, డ్రయ్యర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు అత్యాధునిక సెలూన్ లను నిర్వహించుకునేందుకు ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. రజకులు, నాయీ బ్రాహ్మణుల కోసం రూ. 500 కోట్ల బడ్జెట్ ను కేటాయించామని తెలిపారు. విశ్వకర్మ, వడ్రంగి, కల్లుగీత, టైలరింగ్ వృత్తులవారికి కూడా ఆధునిక పరికరాలను అందిస్తామని చెప్పారు. ఈ పథకాలన్నింటినీ వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News