: నేడు నాంపల్లి కోర్టుకు హీరో మహేశ్ బాబు


మహేశ్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'శ్రీమంతుడు' కథ కాపీ కేసు విచారణ నేడు నాంపల్లి కోర్టులో జరగనుండగా, మహేశ్ కోర్టుకు హాజరు కానున్నారు. ఈ కేసు విచారణ నుంచి గతంలో మహేశ్ బాబు వ్యక్తిగత మినహాయింపును కోరినప్పటికీ, కోర్టు అంగీకరించలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి విచారణకు మహేశ్ హాజరు కాకుంటే, వారంట్లు జారీ అవుతాయి.

పరిస్థితి అంతవరకూ రాకూడదన్న ఉద్దేశంతో మహేశ్ స్వయంగా కోర్టుకు వచ్చి, తదుపరి హాజరు నుంచి మినహాయింపు కోరతారని తెలుస్తోంది. కాగా, తాను ఐదేళ్ల నాడు 'స్వాతి' మాస పత్రిక కోసం రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవల ఆధారంగా 'శ్రీమంతుడు' సినిమా తీశారని, తన నుంచి అనుమతులు తీసుకోలేదని ఆర్డీ విల్సన్‌ అలియాస్‌ శరత్‌ చంద్ర అనే రచయిత కోర్టులో కాపీ రైట్ చట్ట ఉల్లంఘనల సెక్షన్ల కింద కేసు వేశారన్న సంగతి విదితమే.

  • Loading...

More Telugu News