: తెలంగాణకు భారీ వర్ష సూచన!


వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి బలహీన పడింది. దీని ప్రభావంతో నిన్న కోస్తాంధ్ర, తెలంగాణల్లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉందని... దీంతో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News