: సల్మాన్ కు షాక్... మాడిపోయిన 'ట్యూబ్ లైట్'!


సల్మాన్ ఖాన్ కు భారీ షాక్ తగిలింది. ఏక్ థా టైగర్, భజరంగీ భాయ్ జాన్ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేద్దామని భావించి, కబీర్ ఖాన్ తో ముచ్చటగా మూడోసారి జతకట్టిన సల్మాన్ ఖాతాలో భారీ డిజాస్టర్ పడింది. ఐదేళ్ల తరువాత సల్మాన్ ఖాతాలో ఫ్లాప్ నమోదైంది. ట్యూబ్ లైట్ లో సల్మాన్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ సరైన కథలేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయినట్టు తొలిరోజే రివ్యూలు వెలువడ్డాయి. దీంతో సల్మాన్ కెరీర్ లో ఎన్నడూ లేనంత తక్కువ వసూళ్లు తొలిరోజు నమోదయ్యాయి. 21 కోట్లతో సల్మాన్ సరిపెట్టుకున్నాడు.

అలాగే తొలి వీకెండ్ వసూళ్లు కూడా కేవలం 66 కోట్ల రూపాయలకే పరిమితమయ్యాయి. గత ఐదేళ్లలో సల్మాన్ సినిమాకు అతితక్కువ వసూళ్లు ఈ సినిమాకే వచ్చాయి. శని, ఆది, సోమవారం (రంజాన్) వరుసగా సెలవులు వచ్చినప్పటికీ, దీనిని చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ సినిమా ఫ్లాపైందని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. కాగా, ఈ సినిమాను సల్మాన్ తన సోదరుడితో కలిసి నిర్మించడం విశేషం. ఈ సినిమాలో షారూఖ్ అతిథి వేషమేసినా గట్టెక్కలేదంటే కథ ఎంత బలహీనమైనదో ఊహించవచ్చు. ఇక ఈ సినిమా నష్టాల బారి నుంచి బయటపడాలంటే 276 కోట్లు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 120 కోట్ల వసూళ్లు కూడా కష్టమేనని వారు పేర్కొంటున్నారు. దీంతో ఈ సినిమా సల్మాన్ కు నష్టాలు మిగిల్చిందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News