: మోదీ గొప్ప ప్రధాని.. ఆకాశానికెత్తేసిన ట్రంప్!


భారత ప్రధాని నరేంద్రమోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప ప్రధాని అని కొనియాడారు. దేశంలో ఆర్థికాభివృద్ధిని తీసుకొచ్చారని అన్నారు. అలాగే 2014లో ట్రంప్ భారత్‌లో పర్యటించినప్పటి విషయాలను మోదీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన తన గురించి మంచి అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. మంగళవారం ఉదయం వైట్‌హౌస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ట్రంప్, మెలానియా దంపతులు సాదరస్వాగతం పలికారు. అనంతరం ట్రంప్ క్లుప్తంగా మాట్లాడారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు గతంలో ఎప్పుడూ దృఢంగా, గొప్పగా లేవని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సహా పలు ప్రాంతీయ సమస్యలపై ఇద్దరూ చర్చించారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.  ఇద్దరం కలిసి ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని ప్రతినబూనారు.

  • Loading...

More Telugu News