: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం తప్పిపోవడానికి కారణమిదేనా?
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం తిరుమలలో తప్పిపోయిన సంగతి తెలిసిందే. తిరుపతి సమీపంలో ఉన్న కరకంబాడిలో ఆయనను పోలీసులు గుర్తించారు. బాగా నీరసించిపోయిన ఆయనకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఉన్నట్టుండి మాయం కావడం సంచలనం రేకెత్తించింది. అయితే, ఆయన మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎటు వెళ్తున్నారో తెలియకుండానే ఆయన తిరుమల కొండ మీద నుంచి వెళ్లిపోయారు. ఏదేమైనప్పటికీ ఆయన క్షేమంగా దొరకడంతో కుటుంబసభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.