: రెండో వన్డేలో అందరికీ షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్!
వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ విఫలమవుతున్నాడు. తొలి వన్డేలో కేవలం నాలుగు పరుగులు చేసిన యువరాజ్, రెండో వన్డేలో 14 పరుగులకే ఔట్ అయి ఉసూరుమనిపించాడు. అయితే, రెండో వన్డేలో యువీ అందరినీ ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తయారు చేసిన జెర్సీని విండీస్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఉపయోగించాడు.
మామూలుగా ప్రతి సిరీస్ కి ముందు జట్టు సభ్యులకు టీమ్ మేనేజ్ మెంట్ కొత్త జెర్సీలను ఇస్తుంటుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నేరుగా వెస్టిండీస్ కు వెళ్లడంతో... ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలను కూడా మనవాళ్లు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీని విండీస్ తో జరిగిన మ్యాచ్ లో పొరపాటున వేసుకున్నాడు. యువీ ధరించిన జెర్సీని చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న యువీ... విండీస్ పర్యటనకు తయారు చేసిన జెర్సీని వేసుకున్నాడు.