: నా క్లయింట్ రాజీవ్ కి ఏమీ తెలియదు... ఆ పరిణామాలన్నీ యాక్సిడెంటల్ గా జరిగాయి: 'శిరీష కేసు'పై రాజీవ్ లాయర్
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్ కు ఏమీ తెలియదని అతని తరపు లాయర్ తెలిపారు. తన క్లయింట్ ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. రెండు రోజుల కస్టడీకి పోలీసులు రాజీవ్ ను తీసుకెళ్లారని, విచారిస్తారని ఆయన అన్నారు. మనదేశం కసబ్ లాంటి వాడికే న్యాయసహాయం అందించిందని, ఈ కేసు అంతకంటే పెద్దకేసు కాదని ఆయన చెప్పారు. కోర్టులో కేసు ఉన్న కారణంగా దీనిపై ఎక్కువ విషయాలు వెల్లడించలేమని అన్నారు. ఈ కేసులో నిజానిజాలను పోలీసులు వెలికి తీస్తారని ఆయన చెప్పారు. తన క్లయింట్ తనకేమీ తెలియదని వివరించాడని, యాక్సిడెంటల్ గా ఈ కేసులో పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయని చెప్పాడని రాజీవ్ లాయర్ తెలిపారు.