: పాతికేళ్లుగా తనను భరించినందుకు థ్యాంక్స్ చెప్పిన బాలీవుడ్ స్టార్!


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినీపరిశ్రమలో అడుగుపెట్టి నిన్నటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో 'దీవానా' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు ఫారుఖ్. అంతకు ముందు సర్కస్, ఫౌజీలాంటి టీవీ సీరియళ్లలో నటించాడు. బాలీవుడ్ లో బాజీగర్, అంజామ్, డర్ లాంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ కూడా చేసి, ప్రేక్షకులను అలరించాడు. 25 ఏళ్ల కెరియర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా తన అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. నిద్ర లేచిన తర్వాత 25 ఏళ్ల కెరియర్ ను పూర్తి చేసుకున్నాననే విషయం గుర్తుకొచ్చిందని... ఇన్నేళ్లుగా తనను భరించినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు.

  • Loading...

More Telugu News