: హర్యానా అందాలరాశి మానుషీ సొంతమైన మిస్ ఇండియా 2017 కిరీటం
ఈ సంవత్సరం ఫెమీనా మిస్ ఇండియా కిరీటం హర్యానాకు చెందిన అందాల రాశి మానుషీ చిల్లార్ కు దక్కింది. ఫస్ట్ రన్నరప్ గా కాశ్మీరుకు చెందిన సనా దువా, సెకండ్ రన్నరప్ గా బీహారుకు చెందిన ప్రియాంకా కుమారి నిలిచారు. కిక్కిరిసిన ఆహూతుల మధ్య గత సంవత్సరం విజేత ప్రియదర్శినీ చటర్జీ, మానుషీకి అందాల రాశి కిరీటాన్ని అలంకరించింది. ఇండియన్ కల్చర్ రౌండుతో పాటు న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పిన మానుషీ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. ఫైనల్ పోటీలకు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్ హోత్రా దుస్తులను డిజైన్ చేయగా, ఆభరణాలను శోభా శ్రింగార్ అందించారు.