: నేపాల్, భూటాన్ పర్యటనలకు ‘ఆధార్’ పనికిరాదు.. స్పష్టం చేసిన కేంద్రం
నేపాల్, భూటాన్ వెళ్లే భారతీయులు ఇకపై ఆధార్ తీసుకెళ్తే చెల్లదు. భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్ కానీ, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కానీ వుండాలని స్పష్టం చేసింది. అంతేకానీ ఆధార్ కార్డు చెల్లదని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎటువంటి వీసా లేకుండానే భారతీయులు నేపాల్, భూటాన్ వెళ్లవచ్చు. ఇందుకోసం వారు పాస్‌పోర్టు కానీ, ఎలక్షన్ ఐడీ కానీ చూపించాల్సి ఉంటుంది. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, 15 ఏళ్ల లోపు చిన్నారులు వారి జన్మదినాన్ని నిర్ధారించే ఫొటో కలిగిన పత్రాన్ని చూపిస్తే సరిపోతుంది. పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డును కూడా ఇందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు ను మాత్రం పరిగణనలోకి తీసుకోరు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆధార్ కార్డును విలువైన పత్రంగా పరిగణించబోమని పేర్కొంది.