: వాషింగ్ మెషీన్ లా ఊగిపోయిన విమానం... భయాందోళనలకు గురైన ప్రయాణికులు...వీడియో చూడండి
ఎయిర్ ఏషియాకు చెందిన విమానం వాషింగ్ మెషీన్ తిరిగినట్టు ఊగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మలేసియా నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన ఎయిర్ బస్ ఏ 330 విమానం భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా విమానం ఊగిపోవడం ప్రారంభించింది. దాంతో ప్రయాణికుల సీట్లు కూడా ఊగిపోవడంతో, విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గుండెలరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు.
అయితే విమానంలోని సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ దానిని దారిమళ్లించి, సురక్షితంగా పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. విమానం దిగిన ప్రయాణికులు జరిగిన ఘటనపై మాట్లాడుతూ, చాలా భయపడిపోయామని అన్నారు. సురక్షితంగా ల్యాండవ్వాలని దేవుణ్ణి ప్రార్ధించామని తెలిపారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.