: హైదరాబాద్ లో భారీ వర్షం!
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి భారీ వర్షం కురిసింది. మాదాపూర్, మలక్ పేట, పాతబస్తీ, దిల్ సుఖ్ నగర్, మోతీ నగర్, రాజీవ్ నగర్, కూకట్ పల్లి, ఐఎస్ సదన్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.