: కథ చెప్పేటప్పుడు మాత్రం నన్ను మించినోడు లేడన్నట్టు చెబుతాను!: దర్శకుడు రాజమౌళి


కథ చెప్పేటప్పుడు తాను చాలా కాన్ఫిడెన్స్ తో ఉంటానని, కానీ, డైరెక్షన్ చేసేటప్పుడే ప్రతి సెకన్ డౌట్ పడుతుంటానని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కథ చెప్పేటప్పుడు నన్ను మించినవాడు లేడన్నట్టు చెబుతాను. డైరెక్షన్ చేసేటప్పుడు.. కరెక్టు షాటా? కాదా? ఆర్టిస్టుతో కరెక్టుగా చేయిస్తున్నానా? లేదా?.. ఇలా ప్రతి సెకన్ డౌట్ గానే ఉంటాను. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, సై చిత్రాల వరకూ నాకు ఏ డౌట్లూ ఉండేవి కాదు. నేను పెట్టిందే ఫ్రేమ్.. దీన్ని మించింది లేదని అనుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత చిన్నగా తెలిసింది. మనకు తెలియనివి చాలా ఉన్నాయని. దీంతో, డౌట్లు పెరగడం ప్రారంభమైంది’ అని అన్నారు.

  • Loading...

More Telugu News