: 8 మంది ఎమిరేట్ రాణులను దోషులుగా ప్రకటించిన బెల్జియం న్యాయస్థానం
మనుషుల అక్రమ రవాణా నేరం కింద 8 మంది ఎమిరేట్ రాణులను దోషులుగా ప్రకటిస్తూ బెల్జియంలోని బ్రస్సెల్స్ న్యాయస్థానం శిక్ష విధించింది. ఇక్కడి ఓ లగ్జరీ హోటల్లో దాదాపు పదేళ్ల క్రితం పనివాళ్లను అవమానించడం, అక్రమంగా తరలించడం, హింసించడం తదితర నేరాల కింద వారికి శిక్ష విధించినట్లు న్యాయవాది స్టీఫెన్ మనోద్ తెలిపారు. దశాబ్దకాలంగా ఎన్నో తప్పుదోవలు పడుతున్న ఈ కేసులో బెల్జియం కోర్టు సరైన న్యాయం కల్పించి, దోషులకు 1,65,000 యూరోల జరిమానా కూడా విధించినట్లు ఆయన వివరించారు. హోటల్ నుంచి తప్పించుకున్న ఓ మహిళ కేసు వేయడంతో అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఏ ఒక్కరోజు కూడా ఆ 8 మంది రాణులు కోర్టుకి హాజరుకాలేదు.