: లాడ్జిలో ఆ బాలికలను తల్లిదండ్రులే చంపేశారు.. తేల్చిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని ఎస్ఆర్‌సీ లాడ్జిలో ఇద్దరు బాలికలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతులను అనూష(9), శిరీష(7)లుగా గుర్తించి వారు ఎలా చనిపోయారో తేల్చారు. నిన్న సాయంత్రం వారిని లాడ్జికి తీసుకొచ్చి తల్లిదండ్రులే వారికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి చంపేశారని, అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.
కాగా, వారి తల్లిదండ్రులు సత్యనారాయణ, గౌరమ్మల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారంతా నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ లాడ్జిలోకి వచ్చారని చెప్పారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఆ దంపతులు బయటకు వెళ్లి వస్తామని లాడ్జి సిబ్బందికి చెప్పారని అన్నారు. కన్న కూతుళ్లనే తల్లిదండ్రులు విషం ఇచ్చి ఎందుకు చంపుకోవాల్సి వచ్చిందనే విషయం తెలియాల్సి ఉంది.