: టీడీపీ ఎమ్మెల్యే కారుపైకి దూసుకొచ్చిన టిప్పర్
టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొనడంతో... ఆయన గాయపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శీలంవారిపల్లె వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ బాబూరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.