: కోహ్లీ అహంకారానికి నిదర్శనం....ఫైనల్స్ లో 'బ్యాటింగ్ ఎంచుకో' అని కుంబ్లే చెబితే, బౌలింగ్ ఎంచుకున్నాడు!


టీమిండియా చీఫ్ కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేయడంతో పలు విషయాలు వెలుగులోకి వస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రధానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తలబిరుసుతనంపై ఒక్కో విషయం వెలుగు చూస్తూ అతనిపైనున్న అభిమానాన్ని తగ్గిస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఘటన దేశప్రతిష్ఠను మసకబార్చేది కావడంతో అతనిపై గౌరవం మరింత  తగ్గుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే....ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్, పాకిస్థాన్ జట్లు చేరిన నేపథ్యంలో, భారత్ పై టాస్ నెగ్గితే ఫీల్డింగ్ ఎంచుకునే ఘోర తప్పిదం మాత్రం చేయవద్దని దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జట్టుకి సూచనలు చేసిన సంగతి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వచ్చింది.

 అలాగే బ్యాటింగ్ లో బలంగా ఉన్న టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని నిర్దేశించాలని ఎంతో మంది వెటరన్ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. ఇది కూడా టీవీల్లో, పత్రికల్లో వచ్చింది. అయితే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టాస్ కు వెళ్లే ముందు కోహ్లీకి కోచ్ గా కుంబ్లే టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని నేరుగా చెప్పాడు. అయితే కోహ్లీ తలబిరుసుతనంతో కుంబ్లే మీద ప్రతీకార చర్యగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతే, ఆ తరువాత జరిగిందంతా తెలిసిందే. ఐసీసీ ట్రోఫీల్లో భారత్ పై విజయమన్నదే ఎరుగని పాకిస్థాన్ విజయం సాధించడం మాత్రమే కాకుండా ఏకంగా ట్రోఫీని సగర్వంగా తమ దేశానికి తీసుకెళ్లింది.

  • Loading...

More Telugu News