: ఉపాధ్యాయ సంఘాలతో గంటా చర్చలు సఫలం.. ఆందోళన విరమణ!

ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఈరోజు తలపెట్టిన ఛలో అమరావతి ఆందోళనను టీచర్లు విరమించుకున్నారు. మంత్రితో టీచర్ల యూనియన్ ప్రతినిధుల సమావేశం సందర్భంగా, టీచర్ల రేషనలైజేషన్, వెబ్ కౌన్సిలింగ్, ప్రతిభ ఆధారిత పాయింట్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. మార్పులతో టీచర్ల బదిలీల ప్రక్రియకు ఉపాధ్యాయ సంఘాలు అంగీకారం తెలిపాయి. ముఖ్యమంత్రితో చర్చించి, నిబంధనల మార్పులతో బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ పై కేంద్రం ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూడాలని గంటా ఉపాధ్యాయులను కోరారు. పదోన్నతుల తరువాత బదిలీ ప్రక్రియ చేపడితే బాగుంటుందని మంత్రి సూచించగా, దీనిపై ఆలోచించి చెబుతామని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. 

More Telugu News