: రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతా: ర‌జ‌నీకాంత్

ఈ ఏడాది తాను సెప్టెంబ‌రు, అక్టోబ‌రుల్లో మ‌రోసారి త‌న అభిమానుల‌తో భేటీ అయి చ‌ర్చిస్తాన‌ని సౌతిండియా సూప‌ర్ స్టార్ రజ‌నీ కాంత్ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. విలేకరులు అడుగుతున్న పలు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌డానికి నిరాక‌రించారు. తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతాని ర‌జ‌నీకాంత్ అన్నారు.

ర‌జ‌నీకాంత్ ఈ రోజు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌ని డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ర‌జ‌నీ ఈ రోజు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఓ హింట్ ఇచ్చారని ఆయ‌న అభిమానుల్లో చ‌ర్చ మొద‌లైంది. ప్రస్తుతం రజనీ కాంత్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు.  

More Telugu News