: ఇళ్ల గోడలపై బీజేపీ రాతలు.. షాకైన స్థానికులు!

మ‌ధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆ రాష్ట్ర అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించారు. రాత్రికి రాత్రి ఇళ్ల‌ గోడలపై ‘నా ఇల్లు.. బీజేపీ ఇల్లు’ అని రాసేశారు. ఉద‌యాన్నే నిద్ర‌లేచి త‌మ గోడ‌ల‌పై ఉన్న రాత‌లు చూసిన స్థానికులు షాకయ్యారు. ప‌లువురు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ఇళ్ల గోడ‌ల‌పై కూడా ఈ నినాదం క‌నిపించింది. తమ అనుమతి లేకుండా తమ గోడలపై ఇలాంటి రాతలు రాయడం ప‌ట్ల స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీజేపీ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన‌ బీజేపీ నేతలు ఆ ప్రాంతాన్ని త‌మ పార్టీయే అభివృద్ధి చేసిందని అన్నారు. త‌మ పార్టీ కార్యకర్తలు సంతోషం పట్టలేక ఇలా రాశార‌ని అన్నారు.     

More Telugu News