: శంషాబాద్ ఎయిర్ పోర్టులో తక్షణం చేపట్టాల్సిన భద్రతా చర్యలను సూచించిన పోలీసులు


హైదరాబాదులోని శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను పోలీసులు వివరించారు. ఎయిర్ పోర్టులో హైలెవెల్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో పలు అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ఎయిర్‌ పోర్టుకు ఉగ్రముప్పు పొంచి ఉందని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తక్షణం ఎయిర్ పోర్టులో చేపట్టాల్సిన భద్రతా ప్రమాణాలను సూచించారు.

తక్షణం రన్‌ వే చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సూచించారు. బయటి నుంచి చూస్తే రన్ వే మొత్తం కనిపిస్తోందని, అది కనిపించకుండా ఎత్తైన ప్రహరీ నిర్మించాలని సూచించారు. అంతే కాకుండా రన్ వే చుట్టూ అత్యాధునిక సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. ఎయిర్ పోర్టు విస్తరణకు భూమి కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ముందు జాగ్రత్తగా మరిన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News