: పోస్టర్ అదిరిపోయింది బ్రదర్: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పై వరుణ్ తేజ్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న కొత్త సినిమా ‘జవాన్’ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా స్టోరీపై క్లూ ఇస్తూ సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో ‘కుటుంబానికా? దేశానికా? ఈ సినిమాలో జై ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడు?’ అని కూడా పేర్కొన్నాడు. ఆ ఫస్ట్‌లుక్‌లో ఆయన కనపడుతోన్న తీరు అభిమానులను అలరిస్తోంది. ఆ పోస్టర్ లో సాయిధరమ్ తేజ్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉందని ప్రశంసిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ మరో హిట్ కొట్టబోతున్నాడని పేర్కొంటున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌పై స్పందించిన హీరో వరుణ్ తేజ్... ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది బ్రదర్ అని ట్వీట్ చేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నారు.