: అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశ.. నో బెనిఫిట్ షోస్!


భారీ అంచనాలతో తెరకెక్కిన అల్లు అర్జున్ చిత్రం 'దువ్వాడ జగన్నాథం' శుక్రవారం నాడు రిలీజ్ అవుతోంది. 'సరైనోడు' సినిమాతో బన్నీ తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇప్పుడు 'డీజే' సినిమాతో 'సరైనోడు' రికార్డును బద్దలు కొట్టాలని బన్నీ చూస్తున్నాడు.

మరోవైపు, ఈ మధ్య కాలంలో దాదాపు టాప్ హీరోల సినిమాలన్నింటినీ రిలీజ్ కు ముందు రోజు స్పెషల్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోల పేరుతో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 'దువ్వాడ జగన్నాథం' సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని సినిమా యూనిట్ ప్రకటించింది. ఇది బన్నీ అభిమానులను ఎంతో నిరాశపరిచే అంశమే. 'సరైనోడు' సినిమాను కూడా బెనిఫిట్ షోస్ లేకుండానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అదే ఫార్ములాను ఇప్పుడు కూడా ఫాలో కావాలని 'డీజే' దర్శకనిర్మాతలు నిర్ణయించారు. 

  • Loading...

More Telugu News