: కోచ్ నచ్చకున్నా 20 ఏళ్లు కలసి నడిచాను: కోహ్లీ టీమ్ ను దిమ్మతిరిగే ట్వీట్ తో కొట్టిన అభినవ్ బింద్రా
తమకు కోచ్ గా ఉన్న అనిల్ కుంబ్లే నచ్చలేదని ఫిర్యాదు చేసి, జట్టులో అభిప్రాయభేదాలు ఉన్నాయని బీసీసీఐ పెద్దలకు చెప్పి, స్వయంగా అనిల్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేసేంత పరిస్థితి కల్పించడంపై, ఏస్ షూటర్, భారత్ కు షూటింగ్ లో ఒలింపిక్ స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా వినూత్నంగా స్పందించాడు.
తన ట్విట్టర్ ఖాతాలో కోహ్లీ టీమ్ కు దిమ్మతిరిగే ట్వీట్ ను పెట్టాడు. "నాకు అతిపెద్ద టీచర్ నా కోచ్ ఉవే. నేను అతన్ని ఎంతో ద్వేషించాను. కానీ, అతనితో కలిసి 20 సంవత్సరాలు నడిచాను. అతను నాకు నిత్యమూ నచ్చని విషయాలే చెప్పేవాడు" అని ట్వీట్ పెట్టాడు. కుంబ్లే పేరును గానీ, మరెవరి పేరును గానీ బింద్రా పేర్కొనకపోయినా, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయి వేల షేర్లను తెచ్చుకుంది.