: కుంబ్లే షాపింగులకు, షికార్లకు అనుమతిచ్చే రకం కాదు: కోహ్లీపై గవాస్కర్ విసుర్లు


కుంబ్లే లాంటి పోరాట యోధుడు ఇలా జట్టును వదిలి వెళ్తాడని తాను ఎంతమాత్రమూ అనుకోలేదని, మరింత బలంగా అతడు తిరిగొస్తాడని ఆశిస్తున్నానని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. కుంబ్లే రాజీనామా, కోహ్లీతో విభేదాలపై స్పందించిన ఆయన, తాను నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే కుంబ్లే, ఆటగాళ్లు, ముఖ్యంగా కోహ్లీ కోరుకునేట్టుగా షాపింగులకు, షికార్లకు అనుమతించే వ్యక్తి కాదని అన్నారు. షికార్లకు మరిగిన పలువురు ఆటగాళ్లు కుంబ్లేపై ఫిర్యాదు చేసుంటారని, వారికి కోహ్లీ మద్దతు పలకడం దుర్మార్గమని అన్నారు.

 "మీకు బొమ్మలా ఉండేవారే కావాలని అనుకుంటే నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. 'ఓకే బాయ్స్, ఈ రోజు ప్రాక్టీసు వద్దులే. సరదాగా బయటకు వెళ్లండి' అనే కోచ్ కావాలనుకుంటే,,. అనిల్ కుంబ్లే అటువంటి వ్యక్తి కాదు. కుంబ్లే వద్దనే వారికి టీమిండియాలోనే స్థానం ఇవ్వకూడదన్నది నా అభిప్రాయం" అన్నారు. గత ఏడాదిలో కుంబ్లే ఎంతో సాధించి చూపాడని, జట్టు మొత్తం సమష్టిగా విజయాలు సాధించేలా చూశాడని అన్నారు. కుంబ్లే నిష్క్రమణ భారత క్రికెట్ పై తప్పుడు సంకేతాలను చూపుతోందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News