: ఉగ్ర ముప్పును ఎదుర్కొన్న మోదీ... ఆలస్యంగా వెల్లడైన నిజం!


ఇటీవల కేరళలో కొచ్చి మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో, కొచ్చి పర్యటనలో మోదీ ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కొన్నారనే సంచలన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కేరళ డీజీపీ సేన్ కుమార్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. మోదీ పర్యటన సమయంలో ఓ ఉగ్ర సంస్థ ఇక్కడ క్రియాశీలకంగా ఉందని... ఇంతకు మించి దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించడం సాధ్యపడదని ఆయన తెలిపారు.

మరోవైపు, మోదీ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు కొందరు నిరసనకారులు ఆ రోజు ప్రయత్నించారు. ప్రధాని కాన్వాయ్ వచ్చే మార్గంలోకి వారు అనూహ్యంగా దూసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జ్ జరిపి, వారిని తరమికొట్టారు. దీనిపై డీజీపీ మాట్లాడుతూ, వారిని అదుపు చేయడానికి లాఠీ ఛార్జ్ చేయక తప్పలేదని చెప్పారు. ఈ ఆందోళన వెనుక ఉగ్ర హస్తం ఉందని చెప్పారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొచ్చిలో మోదీ పర్యటించారు. 

  • Loading...

More Telugu News