: గవర్నర్ పదవికి రామ్ నాథ్ రాజీనామా... ఆమోదించిన రాష్ట్రపతి!
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఈ నేపథ్యంలో, రామ్ నాథ్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రామ్ నాథ్ స్థానంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి బీహార్ ఇన్ ఛార్జ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.