: పెరిగిన ఇన్ ఫ్లో... సగం నిండిన జూరాల జలాశయం
ఈ ఉదయం 6365 క్యూసెక్కుల వద్ద ఉన్న జూరాల జలాశయం ఇన్ ఫ్లో, మధ్యాహ్నానికి 7,797 క్యూసెక్కులకు పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఇన్ ఫ్లో మరింతగా పెరగవచ్చని అధికారులు చెబుతుండగా, మొత్తం 9.66 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో ఇప్పటికే సగం నిండింది. ప్రస్తుతం జలాశయంలో 4.45 టీఎంసీల నీరుండగా, 147 క్యూసెక్కల ఔట్ ఫ్లో నమోదవుతోంది. గత సంవత్సరం ఇదే సమయానికి జూరాల ప్రాజెక్టులో 2.40 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఆనాటి పరిస్థితితో పోల్చితే, జూన్ లోనే రెట్టింపు నీరు చేరడం ఆనందాన్ని కలిగిస్తోందని అధికారులు అంటున్నారు.