: 2019 వరల్డ్ కప్ క్రికెట్ ఆడే జట్లు ఇవే!
చాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత జట్టు, ఫైనల్ లో తడబడినా, వన్డేల్లో మూడో ర్యాంకును మాత్రం వదులుకోలేదు. ఇదే ఫైనల్ లో భారత్ పై చిరస్మరణీయమైన విజయం సాధించిన పాక్ జట్టు రెండు స్థానాలు మెరుగుపడింది. ఇక 2019లో జరిగే వరల్డ్ కప్ లో పాల్గొనే జట్ల కటాఫ్ తేదీ సెప్టెంబర్ 30 కాగా, టాప్-8 జట్లకు డైరెక్టుగా ఎంట్రీ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న టాప్-8 జట్ల లెక్కలు మారిపోయే అవకాశాలు లేకపోవడంతో ప్రధాన జట్లలో వెస్టిండీస్ మాత్రమే ఓ మెట్టు దిగువన ఉంది. వన్డే ర్యాంకింగ్స్ తొలి స్థానంలోని సౌతాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు కచ్చితంగా ఇంగ్లండులో జరిగే వరల్డ్ కప్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇక 9వ స్థానంలోని వెస్టిండీస్, ఆ తరువాత ఉన్న ఆఫ్గనిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్ దేశాలూ టోర్నీలో భాగం కానున్నాయి.