: మంత్రి గంటాపై చంద్రబాబు అసంతృప్తి.. ఆయన అడిగితే నేను సీబీఐ విచారణ వేయాలా? అంటూ ప్రశ్న!
విశాఖ భూ కుంభకోణం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మంత్రి గంటాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే, అది పూర్తవడానికి 20 ఏళ్లు పడుతుందని ఆయన అన్నారు. గంటా డిమాండ్ చేసినంత మాత్రాన తాను సీబీఐ దర్యాప్తును వేయాలా? అని ప్రశ్నించారు. మొత్తం 276 ఎకరాల భూమి రికార్డులు ట్యాంపర్ అయ్యాయని... అయితే, ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరగలేదని చెప్పారు. సిట్ విచారణలో అన్ని విషయాలు తేలుతాయని తెలిపారు. సీబీఐ విచారణ కావాలని అడుగుతున్న వారి వద్ద ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.