: షారూక్ నివాసం ముందు నుంచి సైకిల్ పై వెళ్లిన సల్మాన్!


ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు సైకిల్ తొక్కడమంటే మహా సరదా. ముంబయి వీధుల్లో సైకిల్ తొక్కుతూ అప్పుడప్పుడు వెళుతుంటాడు. కొన్ని రోజుల క్రితం సల్మాన్ సైకిల్ తొక్కుకుంటూ బాలీవుడ్ బాద్ షా షారూక్ నివాసం ‘మన్నత్’ ముందు నుంచి వెళ్లాడు. షారూక్ నివాసం వద్దకు రాగానే ‘షారూక్ ఖాన్...’ అంటూ పిలిచాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సల్మాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇటీవల పోస్ట్ చేశాడు. సల్మాన్ సైకిల్ పై వెళుతుంటే.. ‘భాయ్ జాన్’ అంటూ పలకరించిన అభిమానులకు సల్మాన్ ఓ చేత్తో స్టైల్ గా అభివాదం చేశాడు. కాగా, సల్మాన్ కొత్త చిత్రం ‘ట్యూబ్ లైట్’ ఈ నెల 23న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News