: హిందూ మక్కల్ కట్చి సంస్థ ప్రతినిధితో రజనీకాంత్ భేటీ


నేషనల్ సౌత్ ఇండియన్ రివర్స్ ఇంటర్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. అయ్యకన్నును చెన్నైలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. తాజాగా, హిందు మక్కల్ కట్చి సంస్థకు చెందిన అర్జున్ సంపత్ ను ఈరోజు రజనీ కలిశారు. రజనీ రాజకీయ రంగప్రవేశం ఖాయమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురితో ఆయన భేటీ కావడంపై వదంతులు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో రజనీ మాట్లాడుతూ, అర్జున్ సంపత్ ను తాను మర్యాదపూర్వకంగా కలిశానే తప్పా, రాజకీయనేపథ్యంలో కాదని స్పష్టం చేశారు. అయితే, అర్జున్ సంపత్ మాత్రం తమిళనాడులోని రాజకీయ దుస్థితిపై రజనీతో చర్చించినట్టు చెప్పారు. తమిళ రాజకీయాలపై దృష్టి సారించాలని రజనీకాంత్ కు విన్నవించుకున్నామని, అందుకు ఆయన ఒప్పుకున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News