: ఆల్ టైమ్ హైలో ముగిసిన సెన్సెక్స్!


ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. జీఎస్టీ, బ్యాంకర్ల సమావేశం నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాల్లో పయనించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్స్ స్టాక్స్ బాగా లాభపడ్డాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 31,312కి ఎగబాకింది. ఈ క్రమంలో ఆల్ టైమ్ హై వద్ద ముగిసింది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 9,658కి చేరుకుంది. హ్యాత్ వే కేబుల్, జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ తదితర కంపెనీల స్టాక్స్ లాభాలను మూటగట్టుకున్నాయి. ఆమ్టెక్ ఆటో, వీడియోకాన్, వక్రంగీ, వోల్టాస్ తదితర కంపెనీల స్టాక్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి. 

  • Loading...

More Telugu News