: రామ్ నాథ్ కోవింద్ రైతుబిడ్డ, నిగర్వి: ప్రధాని మోదీ ప్రశంస


రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరపున ఎంపికైన రామ్ నాథ్ కోవింద్ రైతు బిడ్డ, నిగర్వి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ఎంపికైన అనంతరం, మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. రామ్ నాథ్ తన జీవితాన్ని ప్రజా సేవ కోసం అంకితం చేశారని, పేదల కోసం పాటుపడ్డారని ప్రశంసించారు. న్యాయవాదిగా ఎంతో అనుభవం గడించిన రామ్ నాథ్ కు రాజ్యాంగంపై కూడా ఎంతో అవగాహన ఉందని, తద్వారా దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 

  • Loading...

More Telugu News