: ప్లీజ్.. ఇప్పటికైనా మా దేశానికి వచ్చి ఆడండి: పాకిస్థాన్ కెప్టెన్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తమ ఆటగాళ్లు ఎంతో గొప్పగా ఆడారని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎనిమిదో ర్యాంకు జట్టుగా టోర్నమెంటులో అడుగుపెట్టి, విజేతగా నిలిచామని ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఇతర దేశాలు పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు ముందుకు రావాలని కోరాడు. కొన్నేళ్లుగా పాక్ క్రికెట్ ఒడిదుడుకులకు గురవుతోందని... స్వదేశీ మ్యాచులను దుబాయ్ లో ఆడుతున్నామని... దీనివల్ల మిగతా జట్లలాగ తమకు స్వదేశీ అనుకూలత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా ఇతర జట్లు పాకిస్థాన్ కు వచ్చి ఆడతాయనే విశ్వాసాన్ని సర్ఫరాజ్ వ్యక్తం చేశాడు.