: 'ఫినాయిల్ తాగేశాను...ఆత్మహత్యకు పాల్పడుతున్నా'నని మీడియాకు, స్నేహితులకు సమాచారమిచ్చిన కన్నడ సినీ నటుడు!


కన్నడ నటుడు హుచ్చ వెంకట్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫినాయిల్ తాగానని, ఆత్మహత్యకు పాల్పడుతున్నానని మీడియాతోపాటు స్నేహితులకు కూడా ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన హుచ్చ వెంకట్... వారు అక్కడికి చేరుకుని అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించడంపై విరుచుకుపడ్డాడు. చికిత్సనందించిన వైద్యులను కూడా అడ్డుకున్నాడు.

కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఓ నటిని హుచ్చ వెంకట్‌ ప్రేమించాడని, ఆమె కూడా అతనిని ప్రేమించిందని, కానీ సదరు యువతి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలుస్తోంది. దీంతో ఫినాయిల్‌ తాగి హడావిడి చేశాడు. మరోపక్క, మొదటి నుంచీ విపరీతమైన ప్రచారం యావ కలిగిన హుచ్చ వెంకట్‌ ఈ ఘటనను కూడా తన ప్రచారానికి వాడుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల క్రితం హుచ్చ వెంకట్‌ నటించిన 'పోకిరీ' చిత్రం శాండిల్‌ వుడ్‌ లో అట్టర్‌ ప్లాప్‌ అయిందని, దీంతో నెల రోజులు మౌనంగా ఉన్న హుచ్చ వెంకట్ ఇలా మీడియాలో హడావుడి చేశాడని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News