: ఇకపై పాక్ లో భారత్ క్రికెట్ ఆడదు.. భారత్ లో పాక్ కూడా ఆడదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తారు అభిమానులు. అటువంటిది ఛాంపియన్స్ ట్రోఫీలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత్, పాక్ జట్ల ఆట కోసం క్రికెట్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్‌పై రాజకీయ నేతలు కూడా కామెంట్లు చేస్తున్నారు. రేపు ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో స్పందించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్‌ల మధ్య ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇక భారత్ మాత్రం పాకిస్థాన్ వెళ్లి మ్యాచ్ ఆడబోదని అన్నారు. అంతేకాదు, పాక్ కూడా ఇక్కడకు వచ్చి మ్యాచ్ ఆడదని స్పష్టం చేశారు. విదేశాల్లో మాత్రమే ఆ ఇరు జట్లు తలపడతాయని చెప్పారు.