: నా టార్గెట్ కోహ్లీనే: మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన మహ్మద్ అమీర్


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు అత్యంత కీలకమైన ఫైనల్స్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో, పాక్ ఆటగాళ్లు కూడా టీమిండియా ప్లేయర్స్ పై మైండ్ గేమ్ మొదలుపెట్టారు. వెన్నునొప్పి కారణంగా సెమీస్ కు దూరమైన పాక్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్... పూర్తి ఫిట్ నెస్ తో పైనల్స్ కు రెడీ అయ్యాడు. అమీర్ చేరికతో పాక్ బౌలింగ్ మరింత బలోపేతమయింది.

ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ, తన టార్గెట్ కోహ్లీనే అని చెప్పాడు. కెప్టెన్ హోదాలో తొలి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో కోహ్లీ ఆడుతున్నాడని... దీంతో, అతనిపై చాలా ఒత్తిడి ఉందని చెప్పారు. అతన్ని వీలైనంత త్వరగా పెవిలియన్ కు చేర్చడమే తన లక్ష్యమని అన్నాడు. కోహ్లీ వికెట్ తీసేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్ లో అమీర్ 2 వికెట్లు తీయడమే కాక, 28 పరుగులతో అజేయంగా నిలిచాడు.

  • Loading...

More Telugu News