: అద్భుతమైన అవకాశం...ఫైనల్ లో భారత్ పై ప్రతీకారం తీర్చుకోండి: జహీర్ అబ్బాస్


భారత్ ను ఓడించే అద్భుతమైన అవకాశం పాకిస్థాన్ కు వచ్చిందని ఆ జట్టు మాజీ దిగ్గజం జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో భారత్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ జట్టుకు జహీర్ అబ్బాస్ పిలుపునిచ్చాడు. లండన్ లో ఆయన మాట్లాడుతూ, ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో లీగ్ దశలో భారత్ ఓడించినట్టుగానే, ఫైనల్ లో పాకిస్థాన్ ఆ జట్టును ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని అన్నాడు.

పాకిస్థాన్ జట్టు అద్భుతంగా పుంజుకుందని ఆయన చెప్పాడు. ఇంగ్లండ్ తో ఆడిన మ్యాచ్ లో పాక్ జట్టు ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. ఆ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేశారని ఆయన తెలిపాడు. ఆ మ్యాచ్ పాక్ జట్టులో ఆత్మవిశ్వాసం నింపిందని, ఇదే స్పూర్తితో భారత్ ను ఫైనల్ లో ఓడిస్తారని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News