: 'నీ కూతురి అడ్రెస్ చెప్పు' అంటూ వృద్ధుడి మెడపై కత్తిపెట్టిన యువకుడు!
ఉపాధ్యాయురాలైన కుమార్తె అడ్రెస్ చెప్పాలంటూ ఓ వృద్ధుడి మెడపై కత్తిపెట్టి యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... చెన్నైసమీపంలోని పూందమల్లిలో సాయంత్రం 7 గంటల సమయంలో ఒక యువకుడు ఆ ప్రాంతానికి చెందిన వృద్ధుడి మెడపై కత్తి పెట్టి, ఉపాధ్యాయినిగా పని చేస్తున్న అతని కుమార్తె అడ్రస్ చెప్పాలంటూ బెదిరింపులకు దిగాడు.
సుమారు అరగంటపాటు అతను కత్తిని అలాగే పెట్టి వుంచడంతో అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానికులంతా చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడిన యువకుడిని బంధించి, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. యువకుడిపేరు పార్తీపన్ అని, అతని మానసికస్థితి సరిగ్గాలేదని పోలీసులు తెలిపారు.