: రోహిత్ శర్మ, కరణ్ నాయర్ ను అందుకే విండీస్ పర్యటన జట్టులోకి తీసుకోలేదు: కోహ్లీ
జూన్ 23 నుంచి వెస్టిండీస్ పర్యటనకు భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ జట్టులో రిషబ్ పంత్ కు స్థానం కల్పించగా, ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రాకు స్థానం కల్పించకపోవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. రోహిత్ కు కావాలనే విశ్రాంతి ఇచ్చామని తెలిపాడు. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన రోహిత్ పై ఒత్తిడి పెంచడం ఇష్టం లేక విండీస్ జట్టుకు ఎంపిక చేయలేదని చెప్పాడు. అలాగే జూలైలో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఉందని గుర్తుచేశాడు. ఆ సిరీస్ కోసం రోహిత్ కు విశ్రాంతినిచ్చామని తెలిపాడు. రోహిత్ శర్మ, కరణ్ నాయర్ లు లంకతో టెస్టు సిరీస్ లో ఆడతారని తెలిపాడు. రానున్న ఆరునెల్లలో టీమిండియా మరింత క్రికెట్ ఆడనుందని, మెరుగైన క్రికెట్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని కోహ్లీ చెప్పాడు.