: జేసీ ఇంట్లోనే ఉన్నారు...తలనొప్పితో పడుకున్నారు: సెక్యూరిటీ సిబ్బంది
టీడీపీ సీనియర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తొమ్మిది విమానయాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. జేసీ దురుసుగా ప్రవర్తించిన ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందికి క్షమాపణలు చెప్పాలంటూ విమానయాన సంస్థల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో గైక్వాడ్ సంఘటనతో జేసీ ఘటనను పోలుస్తూ వార్తాకథనాలు ప్రసారమవుతున్నాయి. పార్టీ పరంగా జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో వీటన్నింటికీ విరామమిస్తూ జేసీ తన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆయన సిబ్బంది మాత్రం రహస్యంగా ఉంచుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లోనే రెస్టు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఎవరైనా సందర్శనకు వస్తే...తలనొప్పితో పడుకున్నారని, తరువాత రావాలని చెప్పారని సమాధానం చెబుతున్నారు. ఆయన విదేశాలకు వెళ్లారా? అని అడుగగా... తమకు తెలియదని చెబుతున్నారు. తమపని ఆయన ఏం చెప్పమంటే అది చెప్పడమేనని వారు స్పష్టం చేశారు.