: నా కూతురిది ముమ్మాటికీ హత్యే...ఉద్యోగం చేసే ఆడపిల్లలపై వ్యభిచారి ముద్ర వేస్తున్నారు: శిరీష తండ్రి


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆర్జీఏ స్టూడియోలో మరణించిన బ్యూటిషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎలాంటి అనుమానాలు లేవని, సుదీర్ఘ విచారణ, సైంటిఫిక్ ఎవిడెన్స్ సాయంతో ఆత్మహత్య అని నిర్ధారణకు వచ్చామని పోలీసులు ప్రకటించారు. అలాగే ఏళ్ల పాటు ఎస్సైగా పని చేసి, ఎన్నో కేసులు చూసిన ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తేల్చేశారు. దీనిపై శిరీష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్నది వాస్తవం కాదని ఎవరికైనా అర్థమవుతుందని వారు తెలిపారు. ఉద్యోగం చేసుకునే ఆడపిల్లలపై వ్యభిచారి ముద్ర వేస్తున్నారని, ఉద్యోగం చేసుకోవడమే తమ కుమార్తె చేసిన నేరమా? అని శిరీష తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె విషయంలో న్యాయం కోసం మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

 పోలీసులు న్యాయం చేయాలని బాధితులు వారిని ఆశ్రయిస్తారని, అలాంటిది పోలీసులే అత్యాచారయత్నం చేస్తే ఎవరితో చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తేజస్విని గురించి ఎవరూ మాట్లాడడం లేదని, కేసులో ప్రధాన భాగం ఆమేనని ఆయన చెప్పారు. కేసు పెట్టింది ఆమె అని, ఆమె పాత్ర ఏంటో వివరాలు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఏ1గా శ్రావణ్‌ ను, ఏ2 గా రాజీవ్‌ ను చేర్చడం కూడా ఆసక్తికరంగా మారింది. శిరీషతో శారీరక సంబంధం పెట్టుకున్నది, శిరీష రాత్రి సమయంలో నమ్మి వెళ్లింది రాజీవ్ కారణంగానే... రాజీవే ఆమెపై దాడి చేశాడు. రాజీవే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. రాజీవే ఆమెను ఫ్యాన్ నుంచి కిందికి దించాడని అన్నారు. అలాంటప్పుడు ఈ కేసులో ఏ1గా శ్రావణ్, ఏ2గా రాజీవ్ ను చేర్చడం కూడా ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News