: అమ్మ ఒడిలో చిన్నారి కాజల్!


తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసే నటి కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. అమ్మ ఒళ్లో కూర్చుని ధీమాగా చూస్తున్న చిన్నారి కాజల్ చిన్న గౌను ధరించి ఉండటం ఈ ఫొటోలో మనకు కనపడుతుంది. కాజల్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేసి చిన్ననాటి తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. కాగా, నటుడు రానా సరసన కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో నటుడు కల్యాణ్ రామ్ తో ‘ఎంఎల్ఏ’ చిత్రంలో, తమిళ ‘వివేగం’, ‘క్వీన్’ రీమేక్ చిత్రాల్లో కాజల్ నటిస్తోంది.

  • Loading...

More Telugu News