: డిసెంబర్ 31 లోగా బ్యాంకు ఖాతాలకు ‘ఆధార్’ లింక్ తప్పనిసరి!
బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ విషయంలో మరో ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాలను డిసెంబర్ 31 లోగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సూచించింది. ‘ఆధార్’ అనుసంధానం లేని బ్యాంకు ఖాతాలు చెల్లవని ప్రకటించింది. రూ.50 వేలకు పైగా లావాదేవీలకు ఆధార్ ను తప్పనిసరి చేయడం విదితమే. బ్యాంకు ఖాతాలకు ‘ఆధార్’ తప్పనిసరి చేయడంపై ఖాతాదారులకు ఆయా బ్యాంకులు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది.