: జేసీ దివాకర్ రెడ్డి ఉదంతపై విచారణ జరిపిస్తాం: అశోక్ గజపతి రాజు


టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు వేటు వేయడంతో ఈ ఘటనపై అదే పార్టీకి చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ రోజు ఢిల్లీలో స్పందించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ఉద్యోగి పట్ల జేసీ దివాకర్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించడం, దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు ఆదేశిస్తానని అశోక్ గజపతి రాజు మీడియాకు తెలిపారు. ‘‘వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అసలు ఏం జరిగిందన్న వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. దీనిపై చట్ట ప్రకారం నడుచుకుంటాం‘‘ అని అశోక్ గజపతి రాజు చెప్పారు.

  • Loading...

More Telugu News