: నేనెందుకు ఆ సినిమా షూటింగ్ కు వెళ్లాలో చెప్పండని నిలదీస్తున్న సమంత!
ఈ అక్టోబరు 6న హిందూ క్రైస్తవ పద్ధతులలో యువనటులు సమంత, నాగచైతన్య ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమానుబంధాలను సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో సమంత వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చైతూని విడిచి వెళ్లలేక... తన గోడు సోషల్ మీడియాలో వెళ్లబోసుకుంది. తాజాగా నాగచైతన్య గుండెలపై నిద్రిస్తున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన సమంత... తాజా సినిమా షూటింగ్ కి నెల రోజుల పాటు తమిళనాడులోని తెన్ కాశీకి వెళ్లాల్సి వస్తోందని తెలిపింది.
ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్ కోసం వెళ్లటానికి ముందు.. అసలు నేనెందుకు వెళ్లాలో మూడు కారణాలు చెప్పండి? అంటూ అభిమానులకి ఆసక్తికర ప్రశ్నలు వేసి... చైకి దూరంగా వెళ్లడం ఇష్టం లేదని చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఆమె వేసిన ప్రశ్నలు ఏంటంటే... 1) వర్షం పడే అవకాశముందని వాతావరణశాఖ చెబుతున్న వేళ షూటింగ్ జరుగుతుందా? 2) ఒక వేళ నేను అనారోగ్యానికి గురవుతానేమో? 3) అసలు నా విమానం టేకాఫ్ అవుతుందా? అని ప్రశ్నించింది. అయితే, చైతూ మాత్రం వెళ్లాల్సిందే అన్నట్టున్నాడు. అందుకే... 'ప్లీజ్ నన్ను వెళ్లనివ్వొద్దు' అంటూ వేడుకుంది. ఈ పోస్టు అందర్నీ ఆకట్టుకుంటోంది. వారి ప్రేమను ఈ భావనలు తెలియజేస్తున్నాయని, ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నారని అభిమానులు పేర్కొంటున్నారు.