: కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. డిప్రెషన్‌కులోనై నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ లేఖ రాసి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన కోమలి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి భాస్కరరావు అనే వ్యక్తితో ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కోమలి (30) ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.