: కేసీఆర్ అనుచరులకు భూములు కట్టబెడుతున్నారు: టీడీపీ నేత రమణ
ప్రభుత్వ ఆస్తులకు కాపలా ఉంటానని చెప్పిన కేసీఆర్, తెలంగాణలో భూ కుంభకోణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని టీ టీడీపీ నేత ఎల్. రమణ ప్రశ్నించారు. తెలంగాణలోని భూములను పలు కంపెనీల పేరిట కేసీఆర్ అనుచరులకు కట్టబెడుతున్నారని, వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే భూ కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, టీటీడీపీకి చెందిన మరో నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ, నిన్నటి వరకు యాభై ఎకరాల సొంత భూమి ఉందని చెప్పిన టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, భూ కుంభకోణాలు బయటపడటంతో వెనక్కి తగ్గారని ఆరోపించారు.